School Assembly on September, 2023 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం

Ap School Assembly

School Assembly Assembly on  September, 2023  Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం

 


SSC Exam Center Software 2024: Download (Updated)

School Assembly 2023 | పాఠశాల అసెంబ్లీ – September, 2023 : నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం. September, 2023

School Assembly on September, 2023 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం in AP and TS Schools

నేటి వార్తలు- Today News School Assembly

➥ వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు
➥ ఎల్లుండి జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మంత్రులను కూడా ఆహ్వానించారు.
➥ చిన్నారుల రక్షణకో కిట్‌: చిన్నారి పిల్లలకు అవగాహన కల్పించేందుకు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఆర్‌పీ)తో కలిసి ఐఐటీ కాన్పూర్‌ ఒక కిట్‌ను రూపొందించింది. ఆటలు, యానిమేషన్‌ చిత్రాల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఈ కిట్‌ ఉంటుంది.
➥ ఆ రేఖ తిరగబడితే.. ప్రపంచం గజగజ..!: ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం.. ఆర్థిక సంక్షోభ భయాలు మార్కెట్‌ను చుట్టు ముట్టినప్పుడల్లా ఒక రేఖ గురించి తీవ్రమైన చర్చ మొదలవుతుంది. అదే ‘ ఇన్వర్టెడ్‌ ఈల్డ్‌ కర్వ్’‌.. ! ఇది ఆగస్టు 14న అమెరికా మార్కెట్లలో కనిపించింది.
➥ భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు: చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెట్‌స్కీ మీటింక్‌ రైటర్‌లో భారత అథ్లెట్‌ మహ్మద్‌ అనాస్‌ స్వర్ణ పతాకాన్ని సాధించాడు. ఇదే రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ నిర్మల్‌ టామ్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

నేటి సుభాషితం

“ధైర్యశాలి ముందు ఓటమి చేతులు కట్టుకుని నిలబడుతుంది.”

“One individual may die for an idea but that idea will, after his death, incarnat itself in a thousand lives”

మంచి పద్యం

ప్రేమ చేత మనిషి పెరుగును ధరలోన
కుళ్ళు చేత మనిషి కుంగిపోవు
అహము చేత మనిషి అణగారి పోవును
వినయ భూషితుండు విజయుడగును

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ పరిశ్రమను ఎప్పుడు జాతీయం చేశారు?
జ: 1953

మహానీయుని మాట

” లోకులు తొందరగా నింధిస్తారు. అంతే త్వరగా అభినందిస్తారు కూడా. అందువల్ల ఇతరులు నిన్ను గురించి అనుకునే మాటలకు అంత విలువ ఇవ్వవద్దు.

నేటీ మంచి మాట

” గడిచిన దానికి, గడవబోయే దానికి చింతించకుండా, వర్తమానాన్ని ఆలోచించేవాడు అభివృద్ధిని సాధిస్తాడు.

నేటి ఆణిముత్యం

కానివానితోడ గలసి మెలగుచున్న
గానివానిగానె కాంతురవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తాత్పర్యం:

చెడు నడవడిక కలిగిన వారితో కలిసి తిరిగినట్లయితే వీరు కూడా చెడ్డవారి జాబితాలో చేరిపోతారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా సరే, అతను కల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కానీ పాలు తాగుతున్నాడని అతన్ని ఎవరూ అనుకోరు.

పోలికలు చెప్పటంలో దిట్టైన వేమన, తాటి చెట్టు కింద పాలు తాగేవారితో పోలుస్తూ, చెడ్డవారితో స్నేహం చెడ్డది సుమా అని హెచ్చరిస్తున్నారు. పాలు, కల్లు కూడా తెల్లగానే ఉంటాయి. పాలు తాగేవారెవరూ తాటి చెట్టు దగ్గరికి పోయి తాగరు. కానీ ఒకవేళ అలా తాగుతుంటే అతన్ని చూసేవారు అతను తాగేది పాలు అని అనుకోరు కదా, అలాగే చెడు ప్రవర్తనతో దుందుడుకు చర్యలతో తిరుగుతుండేవారితో స్నేహం చేసి వారితో కలిసి ఆవారాగా తిరిగితే, ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే, అతన్ని కూడా చెడ్డవాడిగానే పరిగణిస్తారు. మానవులంతా ఒకటే, అందరూ సమానులే సర్వమానవ ప్రేమ కలిగివుండాలి, ఇదంతా నిజమ, ఎవరినీ తక్కువగా చూడనక్కరలేదు కానీ, అలాగని అందరితో పూసుకుని తిరగటం కూడా ముప్పు తీసుకురావొచ్చు. అందువలన మనం ఎలాంటివారితో చెలిమి చేస్తున్నామన్నది ఆలోచించవలసిన విషయం. ఏజాతి పక్షులు ఆ జాతి పక్షులతోనే కలిసి ఎగురుతాయని, ఒకేరకం మనస్తత్వాలు కలగినవారే కలిసి మనగలరని మనుషుల నమ్మకం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే సమాజంలో మెసులుకోవాలని వేమనాచార్యుల హెచ్చరిక.

నేటి సామెత

తోక ముడుచుట

తోక ముడుచుట అనగా ఓడి పోవుట లేదా పారి పోవుట అని అర్థం . జంతువులు పోట్లాటకు దిగే టప్పుడు తమ తోకను పైకెత్తుకొని రంగంలోకి దిగుతాయి. అందులో ఏదైనా ఓడి పోతే తన తోకను తన కడుపు క్రిందికి దాచుకొని పారి పోతాయి. కుక్కలు, ఎద్దులు, పులులు, మొదలగు జంతువులలో ఈతతంగం బాగా గమనించ వచ్చు. దాని నుండి పుట్టినదే ఈ సామెత.

నేటి సుభాషితం

మాట్లాడాల్సినచోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సినచోట మాట్లాడటం రెండూ తప్పే.

నేటి జాతీయం

కాళ్లీడ్చుకుంటూ వచ్చాడు
చాలా కష్టపడి వచ్చాడు.
చాఅ దూరంనుండి అధిక ప్రయాసతో వచ్చాడని అర్థము.

నేటి చిన్నారి గీతం

పిడుగులం మేం బుడుగులం
పిడుగులం మేం బుడుగులం
నింగికి నేలకు నిచ్చెనలం
విశ్వ ప్రేమకు వారసులం
బంక మట్టితో బండలు చేస్తాం
ఇసుకతోనే మేం కోటలు కడుతాం
రావి ఆకులతో బూరలు చేస్తాం
కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం
వానొస్తే మేం గంతులు వేస్తాం
కత్తి పడవలే సొంపుగ చేస్తాం
ఆటలు పాటలు కథలని చెపితే
తప్పకుండా మేం బడికి పోతాం

నేటి కథ

 

పక్షుల ఐక్యత



ఒక అడవిలో ఒక పక్షుల గుంపు వుండేది. గంతులు వేస్తూ, కిచ కిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడు కలిసి ఎగురుతూ ఉండేవి.
ఒక రోజు అలాగే కలిసి ఎగురుతుంటే, నేల మీద బోలెడన్ని ధాన్యపు గింజలు కనిపించాయి.
పక్షులంతా ధాన్యం తిందామని నేల దిగంగానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వల వేసి పట్టేశారు.
పక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వలలోంచి బయట పడలేక పోయాయి.
పక్షుల రాజు, “ఇలా కాదు! ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు. అందరం కలిసి, వలను మన పక్షి ముక్కులతో పట్టుకుని, ఒకటే సారి రెక్కలు ఆడిద్దాము. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు.” అని ఆదేశించాడు.
పక్షులంతా ఐకమత్యం తో రాజు చెప్పినట్టు చేసారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయారు.
మనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండి పోయారు. కాస్సేపటికి తరవడం మొదలెట్టారు కానీ అప్పటికీ పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి.
పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గిరికి ఎగురుకుంటూ వెళ్లి, ఎలుకలను సహాయం కోరాయి. ఎలుకలు చక చక వలను పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేసాయి.
ఇలా పక్షులు అన్నీ ప్రాణాపాయ స్థితి లోంచి బయట పడి పది కాలాల పాటు సంతోషంగా వున్నాయి.

చరిత్రలో ఈరోజు ఆగష్టు 19

సంఘటనలు

1944: రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.

1956: కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. ( 1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు)
1960: స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5 ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
2007: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
2011: ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
2011: దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్ కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్‌.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు

జననాలు

1918: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999)
1923: కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.
1925: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (మ.2012)
1946: బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.

మరణాలు

0014: ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
1662: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623)
1994: లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
2015: పడాల బాలకోటయ్య, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)

జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

ప్రపంచ మానవత్వపు దినోత్సవం
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం
ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం. (1919)

సేకరణ:సొంటేల ధనుంజయ మరియు Our Teachers

Scroll to Top